రక్తదానం మరొకరికి ప్రాణాదానం ఎదుటివారికి ఇచ్చే అత్యంత విలువైన బహుమతి రక్తదానం రక్తదాతలు ముందుకు వస్తే మరెన్నో ప్రాణాలు నిలపవచ్చు షేక్ నవాబ్ జాని, రిపోర్టర్ సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 31 ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి ఏదైనా ఉందంటే అదిరక్తదానం మాత్రమేని రిపోర్టర్ నవాబ్ జాని అన్నారు.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఉస్మానియా మస్జీద్ కాంప్లెక్స్ మాజీ రెంట్ …

రక్తదానం మరొకరికి ప్రాణాదానం
ఎదుటివారికి ఇచ్చే అత్యంత విలువైన బహుమతి రక్తదానం
రక్తదాతలు ముందుకు వస్తే మరెన్నో ప్రాణాలు నిలపవచ్చు
షేక్ నవాబ్ జాని, రిపోర్టర్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 31
ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి ఏదైనా ఉందంటే అది
రక్తదానం మాత్రమేని రిపోర్టర్ నవాబ్ జాని అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఉస్మానియా మస్జీద్ కాంప్లెక్స్ మాజీ రెంట్ కలెక్టర్ షేక్ వలి అల్లా తండ్రి షేక్ మీరా వలికి గురువారం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ నందు షేక్ నవాబ్ జాని, మహమ్మద్ నసీర్ (హనీ) ఇరువురు రక్త దానం చేశారు ఈ సందర్బంగా నవాబ్ జాని మాట్లాడుతూ తమ రక్తాన్ని దానం చేయడం అంటే మరొకరి ప్రాణాన్ని కాపాడడంతో సమానమని ప్రాణా పాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని అన్నారు. దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమవు తుందని సకాలంలో రక్తం అందక ఎందరో చని పోతున్నారని సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపడవచ్చని ఇటీవల ఆన్‌లైన్‌లో దాతల వివరాలు అందుబాటులో ఉంచుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినప్పటికీ వీటి గురించి తెలియకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని జాని అన్నారు. ఈ సందర్బంగా రక్తదానంపై ఉన్న అపోహలను మరియు అర్హతలను నవాబ్ జాని వివరించారు
రక్త దానం హానికరం కాదు
రక్తదానంతో జీవితంలో ఇబ్బందులొస్తాయని చాలామంది భయపడతారు. వాస్తవానికి రక్తం ఇవ్వడం వల్ల సదరు వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. వైద్యులు పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని సరిపోయినంత రక్తం ఉందని నిర్ధారించుకున్న తరువాతే మన నుంచి రక్తం తీసుకుంటారు, రక్తదానం చేసిన తరువాత ఆరు నుంచి పన్నెండు వారాలలోపు వ్యక్తికి పూర్తిస్థాయిలో కొత్త రక్తం తయారవుతుంది. ఎలాంటి రక్తహీనత సమస్యలు తలెత్తవు.
ఎవరు రక్తదానం చేయవచ్చు
ఆరోగ్యంగా ఉన్న18 నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు రక్తదానం చేయ్యొచ్చు
జీవితకాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చు
మత్తు మందులకు అలవాటు పడినవారు, హెపటైటీస్ బి, సి, హెచ్‌ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్న వారు రక్తదానానికి అనర్హులు.
ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే 6మాసాలు, పురుషులైతే 3 మాసాలు తర్వాతనే రక్తాన్ని రెండవసారి ఇవ్వడానికి వీలుంటుంది.
రక్తం ఇచ్చేవారు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. ఎటువంటి రుగ్మతలు ఉన్నా రక్తాన్ని స్వీకరించరు.
సగటు 45 కేజీల బరువున్న వారు రక్తదానం చేయవచ్చు అని అన్నారు.
