కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ భేష్ : బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ భేష్ : బండి సంజయ్ తెలంగాణలో చాలా రోజులకు ప్రోటోకాల్ కనిపించిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పార్టీలకతీతంగా నాయకులు, అధికారులు సంతోషంగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరంపర కొనసాగించాలి..పగలు పట్టింపుల తోటి సాదించిందేమీ లేదన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల ఎక్స్ రోడ్ నుండి మేడిపల్లి మండలం కాచారం వరకు రూ. 25 కోట్లతో డబల్ రోడ్ కు శంకుస్థాపన చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే …
![కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ భేష్ : బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ భేష్ : బండి సంజయ్](https://cknewstv.in/wp-content/uploads/2024/11/images-7.jpeg)
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ భేష్ : బండి సంజయ్
తెలంగాణలో చాలా రోజులకు ప్రోటోకాల్ కనిపించిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పార్టీలకతీతంగా నాయకులు, అధికారులు సంతోషంగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరంపర కొనసాగించాలి..పగలు పట్టింపుల తోటి సాదించిందేమీ లేదన్నారు.
జగిత్యాల జిల్లా మాల్యాల ఎక్స్ రోడ్ నుండి మేడిపల్లి మండలం కాచారం వరకు రూ. 25 కోట్లతో డబల్ రోడ్ కు శంకుస్థాపన చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ .. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రోటోకాల్ లేదు, ప్రారంభోత్సవాలు లేవు.. కాంట్రాక్టర్లను బెదిరించడం, కమిషన్లు దండుకోవడం జరిగేవని విమర్శించారు.
గత ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి తెచ్చిందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత అందరూ కలిసిమెలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు బండి సంజయ్.
నుకపల్లి నుండి కాచారం వరకు డబల్ రోడ్ కు కేంద్ర నిధులు మంజూరు చేసింది.. దీనికి రాష్ట్రం కూడా సహకరించిందన్నారు బండి సంజయ్. నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీకి, నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిధులు కరీంనగర్ పార్లమెంట్ కే కేటాయించారని చెప్పారు . మున్ముందు చోప్పదండి నియోజకవర్గానికి ఇంకా నిధులు తీసుకొస్తామన్నారు బండి సంజయ్.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)