మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న వారిపై సెంట్రల్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీ షాదాన్ కాలేజ్ లేన్‌లో మ్యారేజ్‌బ్యూరో పేరుతో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తోందని తెలుసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసి ప్రధాన నిర్వాహకురాలితో పాటు విటులు బానోత్ వీరుడు, షేక్ …
![మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం](https://cknewstv.in/wp-content/uploads/2024/11/images-8.jpeg)
మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం
మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న వారిపై సెంట్రల్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీ షాదాన్ కాలేజ్ లేన్‌లో మ్యారేజ్‌బ్యూరో పేరుతో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది.
వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తోందని తెలుసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసి ప్రధాన నిర్వాహకురాలితో పాటు విటులు బానోత్ వీరుడు, షేక్ సిహబ్, మహ్మద్ సులేమాన్, మహ్మద్ నిజాముద్దీన్లను అదుపులోకి తీసుకొని వీరివద్ద నుంచి ఫోన్లు, నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకొని ఖైరతాబాద్ పోలీసుకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)