రూ. 3 కోట్ల విలువ గంజాయి దహనం... భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ లో నిల్వగల 1186 కేజీల గంజాయిని దగ్ధం. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), నవంబర్ 04, రూ.3 కోట్ల విలువ చేసే 1186 కిలోల గంజాయిని సోమవారం దహనం చేశారు. భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐదు కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఏ డబ్ల్యు ఎస్ కన్సటింగ్‌ లిమిటెడ్‌ గోపాల్ పేట్ తల్లెడ …

రూ. 3 కోట్ల విలువ గంజాయి దహనం...

భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ లో నిల్వగల 1186 కేజీల గంజాయిని దగ్ధం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

నవంబర్ 04,

రూ.3 కోట్ల విలువ చేసే 1186 కిలోల గంజాయిని సోమవారం దహనం చేశారు. భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐదు కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఏ డబ్ల్యు ఎస్ కన్సటింగ్‌ లిమిటెడ్‌ గోపాల్ పేట్ తల్లెడ మండలంలోని దహన కేంద్రంలో గంజాయిని దగ్ధం చేయించారు.

ఖమ్మం డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి, అసిస్టేంట్‌ కమిషనర్‌ గణేష్‌, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రహీమ్‌ ఉన్నీషా బేగం సమక్షంలో గంజాయిని దగ్ధం చేయించారు.

గంజాయిని దగ్ధం చేయించిన ఖమ్మం జి ల్లా ఎక్సైజ్‌ పోలీసులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Updated On 4 Nov 2024 9:12 PM IST
cknews1122

cknews1122

Next Story