చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి పెబ్బేరు నవంబర్04 (సి కే న్యూస్) చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..పెబ్బేరు పట్టణానికి చెందిన మత్స్యకారుడు మోడమోని రాజు సోమవారం పట్టణ సమీపంలో ఉన్న మహబూబ్ పాల్ చెరువులో కావలికారుగా ఉండేవాడు. మధ్యాహ్నం అన్నం తిని చెరువు దగ్గరకు వెళ్ళాడు.చేపలు పట్టడానికి దిగాడు. వల …

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

పెబ్బేరు నవంబర్04 (సి కే న్యూస్)

చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది.

ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..పెబ్బేరు పట్టణానికి చెందిన మత్స్యకారుడు మోడమోని రాజు సోమవారం పట్టణ సమీపంలో ఉన్న మహబూబ్ పాల్ చెరువులో కావలికారుగా ఉండేవాడు. మధ్యాహ్నం అన్నం తిని చెరువు దగ్గరకు వెళ్ళాడు.చేపలు పట్టడానికి దిగాడు.

వల వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.రాజు మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated On 4 Nov 2024 9:21 PM IST
cknews1122

cknews1122

Next Story