చెట్టు కింద పాఠాలు - ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఇది ఎక్కడో మారుమూలపల్లె కాదు మధిర బంజారా కాలనీలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి.. అదనపు తరగతి గదులను నిర్మించాలని విన్నవించుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. మధిర మున్సిపాలిటీ పరిధిలోని బంజారా కాలనీలో ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఎంతో దయనీయం.. తరగతి గది లేక విద్య బోధన చెట్టు కిందికి చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటే విద్య వ్యవస్థ ఎక్కడుందో ఆలోచించుకోవాలి మరి… అన్నిటికి మెరుగులు దిద్ది సౌకర్యాలను ఏర్పాటుచే ప్రభుత్వం …

చెట్టు కింద పాఠాలు - ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

ఇది ఎక్కడో మారుమూలపల్లె కాదు మధిర బంజారా కాలనీలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి..

అదనపు తరగతి గదులను నిర్మించాలని విన్నవించుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు..

మధిర మున్సిపాలిటీ పరిధిలోని బంజారా కాలనీలో ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఎంతో దయనీయం.. తరగతి గది లేక విద్య బోధన చెట్టు కిందికి చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటే విద్య వ్యవస్థ ఎక్కడుందో ఆలోచించుకోవాలి మరి…

అన్నిటికి మెరుగులు దిద్ది సౌకర్యాలను ఏర్పాటుచే ప్రభుత్వం విద్య వ్యవస్థను మాత్రం గాలికి వదిలేసిందిఅనే ఆరోపణలు అనేకం.. దీనికి నిదర్శనమే మధిర మున్సిపాలిటీ పరిధిలోని బంజారా కాలనీలోని ఈ ప్రభుత్వ పాఠశాల. ఒకటి నుండి ఐదు తరగతులు ఉన్న ఈ పాఠశాలలో సుమారుగా 55 మంది విద్యార్థులు ఉన్నారు.

తరగతి గది మాత్రం ఒకటే ఉండడంతో విద్యాబోధన అంతా చెట్ల కింద బోధించవలసి వచ్చిందని సదరు ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కలగజేసుకొని నిర్మించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated On 5 Nov 2024 12:18 PM IST
cknews1122

cknews1122

Next Story