తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ గా కొత్తగూడెం...
కొత్తగూడెం లో కొలువు తీరనున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ.. సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల ప్రతిపాదన. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు పై సీఎం రేవంత్ సుముఖత కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజ్ అప్ గ్రేడ్ తో యూనివర్సిటీ ఏర్పాటు జియాలజీ.. జియో ఫిజిక్స్జియో కెమిస్ట్రీ.. జియో మైన్స్ఎన్విరాన్ మెంట్ సైన్స్. ఇండస్ట్రియల్ సైన్స్ కోర్స్ ల ఏర్పాటు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కి కేరాఫ్ గా మారనున్న కొత్తగూడెం …
![తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ గా కొత్తగూడెం... తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ గా కొత్తగూడెం...](https://cknewstv.in/wp-content/uploads/2024/11/IMG-20241108-WA0022.jpg)
కొత్తగూడెం లో కొలువు తీరనున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ..
సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల ప్రతిపాదన.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు పై సీఎం రేవంత్ సుముఖత
కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజ్ అప్ గ్రేడ్ తో యూనివర్సిటీ ఏర్పాటు
జియాలజీ.. జియో ఫిజిక్స్జియో కెమిస్ట్రీ.. జియో మైన్స్
ఎన్విరాన్ మెంట్ సైన్స్. ఇండస్ట్రియల్ సైన్స్ కోర్స్ ల ఏర్పాటు.
దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కి కేరాఫ్ గా మారనున్న కొత్తగూడెం
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తో విద్యా రంగంలో పెరగనున్న తెలంగాణ కీర్తి
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే చరిత్రలో నిలవనున్న సీఎం రేవంత్..మంత్రి తుమ్మల
దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణ లో ఏర్పాటు కానుందా? పారిశ్రామిక రంగాన్ని విద్యా రంగం అనుసంధానంతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణ కే మణిహారంగా మారనుందా? సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కి కేరాఫ్ కాబోతుందా? ఆయిల్ పామ్ సాగు విస్తరణ తో రైతన్న ఇంట సిరులు కురిపిస్తూ వ్యవసాయ రంగంలో మార్గదర్శి గా నిలిచిన తుమ్మల విద్యారంగంలోనూ తనదైన ముద్ర వేయనున్నారా? ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి చేసిన ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే సీఎం రేవంత్ మంత్రి తుమ్మల చరిత్రలో నిలవనున్నారా?
*ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఇంతకు వరకు విద్యా రంగంలో వినిపించని పేరు*
దేశంలోనే తొలి సారిగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు కు తెలంగాణ లో అడుగులు పడుతున్నాయా అంటే అవుననేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల శ్రీకారం చుట్టారు. సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెం లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదన చేశారు.
కొత్తగూడెం లో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఒకనాటి స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజ్ ను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ గా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి తుమ్మల కోరారు.మంత్రి తుమ్మల ప్రతిపాదన కు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించి యూనివర్సిటీ ఏర్పాటు పై సాంకేతిక పరమైన చిక్కులు లేకుండా అధ్యయనం చేయాలని ఉన్నత విద్యా మండలి , సాంకేతిక నిపుణులకు అసైన్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించారట.
మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణ @ భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేకత చెప్పాలంటే అరుదైన ఖనిజ నిక్షేపాలు ,రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం తో అరుదైన పరిశ్రమల తో మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణ గా నిలిచింది….
సింగరేణి పుట్టినిల్లు గా తెలంగాణకే కల్ప తరువుగా గ్రోత్ ఇంజిన్ గా నిలిచిన సింగరేణి కొత్తగూడెం లోనే కొలువు తీరింది. పాల్వంచ లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు తో విద్యుత్ వెలుగులు అందించే పారిశ్రామిక ప్రాంతం గా మారింది.
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లాంట్ ..నవ భారత్ ఫెర్రో అల్లాయిస్.. ఐ టీ సీ… అశ్వాపురం వద్ద హెవీ వాటర్ ప్లాంట్ తో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది.. అరుదైన పరిశ్రమల తో లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఇండస్ట్రియల్ హబ్ గా కొత్తగూడెం పాల్వంచ మారాయి.
పారిశ్రామిక అభివృద్ధి తో విద్య ను అనుసంధానం చేసి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ప్రతిపాదన.స్కూల్ ఆఫ్ మైన్స్ కు వందల ఎకరాల స్థలం ఉంది. కాలేజ్ కు భవనాలు ఉన్నాయి…
మైన్ ఇంజినీరింగ్ కోర్స్ తో యువత ను మైన్ ఇంజినీర్లు గా దేశానికి అందిస్తున్న కాలేజ్ గా నిలిచింది.
దేశంలోనే మైన్ ఇంజినీరింగ్ లో రెండో కాలేజ్ గా ఉమ్మడి రాష్ట్రంలో మొదటి మైన్ ఇంజినీరింగ్ కాలేజ్ గా 1957 లో స్థాపించారు.ఎంతో చరిత్ర ఉన్న మైన్ ఇంజినీరింగ్ కళాశాల ను అప్ గ్రేడ్ చేసి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదన చేశారు.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ లో కోర్సులు ఇలా
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ లో జియాలజీ….జియో ఫిజిక్స్
జియో కెమిస్ట్రీ….ఎన్విరాన్ మెంట్ సైన్స్….ఇండస్ట్రియల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రాడ్యుయేట్ కోర్సులు ..పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు పీ.హెచ్. డీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి..
ప్రాక్టికల్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైన్స్…మినరల్స్ …ఫారెస్ట్ ఉండటం తో పరిశోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందనీ విద్యా రంగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే మైన్ ఇంజినీర్లు ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్లు దేశానికి అందించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని మంత్రి తుమ్మల విశ్వాసం గా ఉన్నారు.
ఆయిల్ పామ్ సాగు విస్తరణ లో వ్యవసాయ రంగంలో మార్గదర్శి గా నిలిచిన మంత్రి తుమ్మల విద్యా రంగంలో తనదైన ముద్ర వేసేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రతిపాదన తో చరిత్రలో గుర్తుంటారని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం కు మహర్దశ ..
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు అయితే కొత్తగూడెం కు మహర్దశ పట్టినట్లే అని జిల్లా వాసులు అంచనాలు వేస్తున్నారు.ఇప్పటికే సింగరేణి కేటీ పీ ఎస్.. స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఐ టీ సీ తో పారిశ్రామికంగా
ప్రగతి బాటలో ఉన్న కొత్తగూడెం లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కు అడుగులు పడుతున్నాయి.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నీ డిల్లి లో మంత్రి తుమ్మల కలసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు ఇప్పటికే నేషనల్ హైవే అమరావతి నాగపూర్ హైవే తో కనెక్టివిటీ పెరిగింది..
భద్రాద్రి రామయ్య కొలువైన భద్రాచలం తో ఎంతో ప్రసిద్ధి చెందగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ..ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టినట్లె అని జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల చరిత్రలో నిలుస్తారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)