మంచిర్యాల డీటీడీవో పై సస్పెన్షన్‌ వేటు మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం గంగారాంపై సస్పెన్షన్‌ వేటు పడింది. విధులను నిర్లక్ష్యం చేసినందుకుగాను ఆయనను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల పట్టణంలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఈ అంశం రాష్ట్ర అధికార యంత్రాంగానికి తెలిసి …

మంచిర్యాల డీటీడీవో పై సస్పెన్షన్‌ వేటు

మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం గంగారాంపై సస్పెన్షన్‌ వేటు పడింది. విధులను నిర్లక్ష్యం చేసినందుకుగాను ఆయనను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మంచిర్యాల పట్టణంలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు.

ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఈ అంశం రాష్ట్ర అధికార యంత్రాంగానికి తెలిసి వివరణ కోరగా వారిని తప్పుదోవ పట్టించేలా సమాచారం అందించారు.

విషయం తెలిసిన వెంటనే అస్వస్థతకు గురైన 12 మంది విద్యార్థినులను ప్రభుత్వ దవాఖానలో చేర్పించి మెరుగైన వైద్యం అందించారు. వారంతా ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated On 8 Nov 2024 10:45 AM IST
cknews1122

cknews1122

Next Story