హోం గార్డును బానెట్ పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్..
పంజాగుట్టలో కారు బీభత్సం.. హోం గార్డును బానెట్ పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం(నవంబర్ 8) ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఆపకుండా దూసుకెళ్లాడు. రెండ్రోజుల క్రితం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రమాదాల నివారణకు హైదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. …
![హోం గార్డును బానెట్ పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. హోం గార్డును బానెట్ పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్..](https://cknewstv.in/wp-content/uploads/2024/11/n63835592017310763102791cca5663ec4d23ee6e18c250f5e36c8a1f749fa13f7c99d293df2deab1ecea37.jpg)
పంజాగుట్టలో కారు బీభత్సం.. హోం గార్డును బానెట్ పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం(నవంబర్ 8) ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఆపకుండా దూసుకెళ్లాడు.
రెండ్రోజుల క్రితం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రమాదాల నివారణకు హైదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.
రూల్స్ అతిక్రమించే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు మారడం లేదు. ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తున్న సమయాల్లో దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం, కొన్నిసార్లు దాడులకు పాల్పడుతున్నారు.
ఇలాంటి ఘటనల్లో పలువురు ట్రాఫిక్ అధికారులు గాయాలపాలైన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పంజాగుట్టలో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కారుతో గుద్దించాడు. ఆ తర్వాత కారు ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. ఈ సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బానెట్ పై ఉండగా అలానే ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృష్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పంజాగుట్టలో ట్రాఫిక్ పోలీసులు కారు బ్లాక్ ఫిల్స్ చెకింగ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారు డ్రైవర్ ను పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద కారు చెక్ చేయడానికి హోంగార్డ్ రమేష్ కారును ఆపాడు.
ఆ సమయంలో కారు డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ పోలీసులకు సహకరించకుండా ముందుకు దూసుకెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్లాన్ వేశాడు. కానీ, కానిస్టేబుల్ రమేష్ కారును అడ్డుకున్నాడు. కారు ఆపకుండా డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ అనే వ్యక్తి హోం గార్డు రమేష్ నీ ఢీకొట్టి ఈడ్చుకెళ్లి పోయాడు.
కారు బానెట్ పై కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఈఘటనపై పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడమే కాకుండా ట్రాఫిక్ పోలీసును గాయపరిచిన కారు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)