సర్వే కోసం వెళ్తే.. కుక్కలను ఉసిగొల్పుతున్నారు..!
సర్వే కోసం వెళ్తే.. కుక్కలను ఉసిగొల్పుతున్నారు..! సమగ్ర కుటుంబ సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో కొందరు ఇండ్ల యజమానులు సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పి బెదిరింపులకు దిగారు. అరోరా కాలనీలో నివసించే మరో మహిళ వారిపై దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరికొందరు తలుపులు తీయడం లేదని, వ్యక్తిగత వివరాలు మీకెందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నట్లు వారు వాపోయారు. ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాషలాడుతున్నారు. ఐడీ కార్డులు …
సర్వే కోసం వెళ్తే.. కుక్కలను ఉసిగొల్పుతున్నారు..!
సమగ్ర కుటుంబ సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో కొందరు ఇండ్ల యజమానులు సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పి బెదిరింపులకు దిగారు.
అరోరా కాలనీలో నివసించే మరో మహిళ వారిపై దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరికొందరు తలుపులు తీయడం లేదని, వ్యక్తిగత వివరాలు మీకెందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నట్లు వారు వాపోయారు.
ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాషలాడుతున్నారు. ఐడీ కార్డులు లాక్కొని ఫొటోలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదంటున్నారు.
ఇక హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ ఇంట్లో సర్వేకి వెళ్లిన మహిళా ఎన్యూమరేటర్లపై కుక్కలను వదిలారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అపురూప, రమ్మశ్రీ.. అరోరా కాలనీలో కుటుంబ వివరాలు నమోదుచేయడానికి ఓ ఇంట్లోకి వెళ్లారు.
అయితే వారిని దుర్భాషలాడిన ఇంటి యజమాని, వారిపైకి కుక్కలను వదిలాడు. దీంతో భయాందోళనకు గురైనవారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.