మానవత్వం చాటిన మంత్రి పొన్నం ప్రభాకర్.. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని అంబులెన్స్ లో ఎక్కించి.. ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ చేసి ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో మండలం రామచంద్రాపురం స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేటకు చెందిన మురికి పెద్దమ్మ కనువ్వ, స్వప్న ఆటోలో హైదరాబాద్ నుంచి పూవ్వులు తీసుకుని సిద్దిపేటకు …

మానవత్వం చాటిన మంత్రి పొన్నం ప్రభాకర్..

బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని అంబులెన్స్ లో ఎక్కించి.. ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ చేసి ఆదేశించారు.

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో మండలం రామచంద్రాపురం స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేటకు చెందిన మురికి పెద్దమ్మ కనువ్వ, స్వప్న ఆటోలో హైదరాబాద్ నుంచి పూవ్వులు తీసుకుని సిద్దిపేటకు వస్తున్నారు.

రామచంద్రాపూరం స్టేజ్ వద్దకు రాగానే.. వారు ప్రయాణిస్తున్న ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. అప్పుడే హైదరాబాద్ నుంచి హుస్నాబాద్ వెళ్తోన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రోడ్డ ప్రమాదం చూసి ఆగారు.

అప్పుడే అంబులెన్స్ రావడంతో గాయపడిన వారిని అంబులెన్స్ లో గజ్వేల్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. వెంటనే గజ్వేల్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అవసరం ఉంటే హైదరాబాద్ తరలించాలని ఆదేశించారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పొన్నం చెప్పారు. గతంలో కూడా మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని మంత్రి సన్మానించారు.

Updated On 10 Nov 2024 3:22 PM IST
cknews1122

cknews1122

Next Story