కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో… ఎమ్మెల్యే పాయం!
కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో... ఎమ్మెల్యే పాయం! కేటీఆర్ కీళ్లు విరగ్గొడతానంటున్న పినపాక ఎమ్మెల్యే పాయం! మాజీమంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘాటుగా స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే కీళ్లు ఇరుగుతాయని హెచ్చరించారు.పొంగులేటి గురించి మాట్లాడే దమ్ము నీకు, నీ అయ్యా కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ఓ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పాయం పై …

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో... ఎమ్మెల్యే పాయం!
కేటీఆర్ కీళ్లు విరగ్గొడతానంటున్న పినపాక ఎమ్మెల్యే పాయం!
మాజీమంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘాటుగా స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
లేదంటే కీళ్లు ఇరుగుతాయని హెచ్చరించారు.పొంగులేటి గురించి మాట్లాడే దమ్ము నీకు, నీ అయ్యా కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ఓ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పాయం పై విధంగా స్పందించారు.
సోమవారం మణుగూరు ప్రజాభవన్ ఆఫీసులో పాయం మాట్లాడుతూ.. కేటీఆర్ పొంగులేటి గురించి ఒక్క మాట మాట్లాడిన నీకు ఈపు చింతపండు అవుతుందని హెచ్చరించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేల్చే మొట్ట మొదటి బాంబ్ కేటీఆర్ అవుతారని..ఆ బాంబుకు నువ్వు ఎగిరిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను ఎవరు కాపాడుతారో మేము కూడా చూస్తామన్నారు.
మమ్మల్ని వదిలిపెట్టమని కుక్క వాగుడు కాదు కేటీఆర్..నిన్ను,నీ అయ్యని వదిలిపెడతామో లేదో నువ్వే చూస్తావ్‌గా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
