గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.
- జైలుకు తరలింపు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
నవంబర్ 12,
మణుగూరు పరిసర ప్రాంతమైన రాజపేట లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్లు మణుగూరు సీఐ సతీష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు
అందుకు సంబంధించిన వివరాల ప్రకారం మణుగూరు ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రాజుపేట ప్రాంతంలోని గ్రౌండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతని విచారించే క్రమంలో పారిపోతుండగా అతనిని పట్టుకొని విచారించగా అతని వద్ద ఒక కేజీ 350 గ్రాముల గంజాయి దొరికిందని తాను రామానుజవరం ప్రాంతానికి చెందిన మణి కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని 35, 000/- రూపాయలకు కొనుగోలు చేసి దానిలో కొంత నేను గంజాయి తాగినానని చెప్పగా నిందితుని అదుపులో తీసుకొని అరెస్టు చేసి మంగళవారం జైలుకు పంపడం జరిగిందని నిందితుల వివరాలు షేక్ ఇసాక్ తండ్రి పేరు మదర్, (24) క్యాజువల్ లేబర్ బిటిపిఎస్ ఫిష్ మార్కెట్ ఏరియా మణుగూరు చెందిన వ్యక్తి అని అతని వద్ద నుండి స్వాధీన పరచుకున్న సొత్తు వివరాలు కేజీ 350 గ్రాములు గంజాయి, కేటీఎం బైక్ టి జి 28 ఏ 1407 లను స్వాధీన పరుచుకున్నామని నిందితుడు గతంలో కూడా ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో గంజాయి అమ్ముతుండగా మణుగూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు రిమాండ్ కి వెళ్లి రావడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం రామానుజవరం కు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల లో ఎస్ఐ ప్రసాద్ కానిస్టేబుల్ రవీందర్ రామారావు, పుల్లం దాస్, వెంకన్న పాల్గొన్నారు.