మార్కెట్ సిబ్బందిపై ఖమ్మం కలెక్టర్ ఫైర్ ఖమ్మం పత్తి మార్కెట్ సిబ్బంది, దళారులపై జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MSP ధర కంటే తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేయడం కలెక్టర్ సీరియస్ అయ్యారు. నాణ్యమైన పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. మంగళవారం (నవంబర్ 12)న కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఖమ్మం పత్తి మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. MSP ధర కంటే తక్కువ …
![మార్కెట్ సిబ్బందిపై కలెక్టర్ ఫైర్ మార్కెట్ సిబ్బందిపై కలెక్టర్ ఫైర్](https://cknewstv.in/wp-content/uploads/2024/11/IMG-20241112-WA0025.jpg)
మార్కెట్ సిబ్బందిపై ఖమ్మం కలెక్టర్ ఫైర్
ఖమ్మం పత్తి మార్కెట్ సిబ్బంది, దళారులపై జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MSP ధర కంటే తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేయడం కలెక్టర్ సీరియస్ అయ్యారు.
నాణ్యమైన పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. మంగళవారం (నవంబర్ 12)న కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఖమ్మం పత్తి మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
MSP ధర కంటే తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేస్తారంటూ మార్కెట్ అధికారులను ప్రశ్నించారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తేమ శాతం ఉందని.. మోసం చేస్తున్నారని దళారుల పై మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హామీ ఇచ్చారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)