వేధింపులు తాళలేక ఉద్యోగిని ఆత్మహత్య రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు మనస్తాపంతో ఉద్యోగిని ఆత్మహత్య, సూర్యాపేటలో దారుణ ఘటన లయన్స్ కంటి ఆసుపత్రిలోని కొందరు ఉద్యోగుల వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు, కుటుం బ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణానికి చెందిన కిరణ్మయి (29) రెండు నెలల క్రితం లయన్స్ కంటి ఆసుపత్రిలో జూనియర్ ఆప్తమాలజిస్ట్‌గా విధుల్లో చేరింది. ఆమెకు ట్రైనింగ్ …
![వేధింపులు తాళలేక ఉద్యోగిని ఆత్మహత్య వేధింపులు తాళలేక ఉద్యోగిని ఆత్మహత్య](https://cknewstv.in/wp-content/uploads/2024/11/n6388096751731390060851279ddd3c469017b4e94899ccf6bc63a7314f51f6f19c6d111446c7641f59d2b1.jpg)
వేధింపులు తాళలేక ఉద్యోగిని ఆత్మహత్య
రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు
మనస్తాపంతో ఉద్యోగిని ఆత్మహత్య, సూర్యాపేటలో దారుణ ఘటన
లయన్స్ కంటి ఆసుపత్రిలోని కొందరు ఉద్యోగుల వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు, కుటుం బ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణానికి చెందిన కిరణ్మయి (29) రెండు నెలల క్రితం లయన్స్ కంటి ఆసుపత్రిలో జూనియర్ ఆప్తమాలజిస్ట్‌గా విధుల్లో చేరింది.
ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్న సీనియ ర్ ఆప్తమాలజిస్ట్‌లు ఆమెను గత కొంతకాలంగా మానసికంగా వేధిస్తుండేవారు. ఈ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మృతదేహాన్ని కంటి ఆసుపత్రి ఎదుట ఉంచి ధర్నాకు దిగారు. మృతురాలు సూసైడ్ లేఖ రాసినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)