గణపతి ఆలయ నిర్మాణానికి రూ. 50 వేలు విరాళమిచ్చిన కొప్పుల చంద్రశేఖర్ ఖమ్మం అర్బన్: రామన్నపేటలోని మారుతీ నగర్ లో స్వయంభు శ్రీ విజయ గణపతి మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ రూ.50 వేల విరాళం ఇచ్చి తన భక్తి భావాన్ని చాటుకున్నారు. బుధవారం శ్రీ విజయ గణపతి మందిరం శంకుస్థాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మేరకు ఆలయ నిర్మాణ కమిటీ బాధ్యులకు రూ. 50 వేలు అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల …

గణపతి ఆలయ నిర్మాణానికి రూ. 50 వేలు విరాళమిచ్చిన కొప్పుల చంద్రశేఖర్

ఖమ్మం అర్బన్: రామన్నపేటలోని మారుతీ నగర్ లో స్వయంభు శ్రీ విజయ గణపతి మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ రూ.50 వేల విరాళం ఇచ్చి తన భక్తి భావాన్ని చాటుకున్నారు. బుధవారం శ్రీ విజయ గణపతి మందిరం శంకుస్థాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మేరకు ఆలయ నిర్మాణ కమిటీ బాధ్యులకు రూ. 50 వేలు అందజేశారు.

ఈ సందర్భంగా కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని.. విఘ్నాలు తొలగించే ఆ వినాయక ఆలయ నిర్మాణానికి తన వంతుగా సాయం చేసే అవకాశం రావడం అదృష్టమని అన్నారు. భవిష్యత్తులోనూ తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు దిద్దుపూడి వెంకటేశ్వరరావు, నిరంజన్, నాయకులు నరేష్, సుదీర్, శ్రీనివాసరావు, వాస్తు సిద్ధాంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated On 13 Nov 2024 12:52 PM IST
cknews1122

cknews1122

Next Story