డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం! రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్‌ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలకు దిగుతుంటే.. మరోవైపు అదే ట్రాఫిక్ పోలీస్ అధికారి మద్యం తాగి అడ్డంగా బుక్కయ్యాడు. అంతటితో ఆగకుండా తాను మద్యం తాగలేదని బుకాయిస్తూ బ్రీత్‌ అనలైజర్‌కు సహకరించలేదు. అనంతరం సినిమా రేంజ్‌ ట్విస్ట్‌తో మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్న ఏసీపీ సుమన్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ డ్రంక్ …

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం!

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్‌ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలకు దిగుతుంటే.. మరోవైపు అదే ట్రాఫిక్ పోలీస్ అధికారి మద్యం తాగి అడ్డంగా బుక్కయ్యాడు.

అంతటితో ఆగకుండా తాను మద్యం తాగలేదని బుకాయిస్తూ బ్రీత్‌ అనలైజర్‌కు సహకరించలేదు. అనంతరం సినిమా రేంజ్‌ ట్విస్ట్‌తో మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్న ఏసీపీ సుమన్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ చిక్కారు.

ఆ సమయంలో యూనిఫామ్‌లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి బ్రీత్‌ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. అందుకు ఆయన నిరాకరించాడు. అంతటితో ఆగకుండా తాను కూడా పోలీసు డిపార్ట్‌మెంట్ అంటూ అక్కడున్న వారిపై మండిపడ్డారు.

దీంతో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే సుమన్‌కు అదుపులోకి తీసుకున్నారు.

Updated On 14 Nov 2024 4:43 PM IST
cknews1122

cknews1122

Next Story