భద్రాద్రిలో చోర్ వైట్ కలర్……! "రవి" అస్తమించని అక్రమ వ్యాపారం…… తోటి వ్యాపారి పై దొంగతనానికి తెగించిన ప్రముఖ వ్యాపారి…. భద్రాద్రి వ్యాపారుల ఇజ్జత్ తీసిన ఘన "వాసు"డు…. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), నవంబర్ 15, పగలు వ్యాపారం రాత్రి దొంగతనం నీచ బుద్ధి కనపడకుండా తెల్లచొక్కా ధరించి ప్రముఖులతో సావాసం…. గతంలో ఎన్నడూ లేని విధంగా తోటి వ్యాపారి సరుకుని దొంగతనం చేయించి భద్రాద్రి వ్యాపారుల …

భద్రాద్రిలో చోర్ వైట్ కలర్……!

"రవి" అస్తమించని అక్రమ వ్యాపారం……

తోటి వ్యాపారి పై దొంగతనానికి తెగించిన ప్రముఖ వ్యాపారి….

భద్రాద్రి వ్యాపారుల ఇజ్జత్ తీసిన ఘన "వాసు"డు….

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

నవంబర్ 15,

పగలు వ్యాపారం రాత్రి దొంగతనం నీచ బుద్ధి కనపడకుండా తెల్లచొక్కా ధరించి ప్రముఖులతో సావాసం…. గతంలో ఎన్నడూ లేని విధంగా తోటి వ్యాపారి సరుకుని దొంగతనం చేయించి భద్రాద్రి వ్యాపారుల ఇజ్జత్ తీసి పరారీలో ఉన్న రవి అస్తమించని అక్రమ వ్యాపార సామ్రాజ్య ఘన వాసుడి నీ పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిన ఖాకీలు సైతం వైట్ చొక్కాని వదిలేసి బలహీనుల ను బాధ్యులు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని విమర్శలు వినపడుతున్నాయి.

వివరాలకు వెళ్తే నాణ్యమైన నిజాయితీ పరమైన వ్యాపారాలకు కేంద్రమైన భద్రాచలం పట్టణంలో ఒక వ్యాపారికి మరో వ్యాపారి మధ్య స్నేహపూర్వక పోటీ తప్ప తోటి వ్యాపారిని అస్థిరపరిచే ఆలోచనలను లేని దివ్య క్షేత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎదుటి వ్యాపారి గోడం నుండి గుమ్మస్తాల ను మభ్యపెట్టి దొంగతనానికి ప్రోత్సహించి సుమారు 5 లక్షల రూపాయల సరుకుని కాజేసి అడ్డంగా బుక్ అయినాక కూడా తనకున్న మైర్బాణం తో తప్పించుకొని తిరగడంతో ఈ కేసు సంచలనంగా మారింది.

సూపర్ బజార్ సెంటర్లో సుదీర్ఘకాలంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న శ్యామల ఏజెన్సీ సంబంధించిన గోడౌన్ లో ఎదురుంగానే ఉంటూ అదే వ్యాపారం నిర్వహిస్తూ ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రముఖ మోటర్ కంపెనీల సబ్ డీలర్ వ్యాపారి ఆగస్టు నెల చివర్లో తన దగ్గర పనిచేస్తే గుమస్తాల ను ప్రలోభ పెట్టి దొంగతనాని కి ప్రోత్సహించి సుమారు 5 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పైపులను దొంగిలించి దర్జాగా తనకున్న పలుకుబడితో తప్పించుకోవాలని చూసి అడ్డంగా బుక్ అయ్యారు.

ఆగస్టు నెల చివర్లో జరిగిన ఈ దొంగతనాన్ని గుర్తించిన సదరు శ్యామల ఏజెన్సీ యాజమాని సెప్టెంబర్ నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి పది రోజుల క్రితమే చోరీకి గురైన వస్తు సామాగ్రిని రికవరీ చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా గుమ్మస్తాలను మభ్యపెట్టి దొంగతనానికి ప్రోత్సహించి దొంగ సామాగ్రిని తన సొంత షాపులో పెట్టుకున్న అసలు దొంగ తప్పించు కొని తిరుగుతూ తనకున్న పలుకుబడితో కేసును నీరు గారిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి.

అసలు దొంగను వదిలేసి బలహీనులైన గుమస్తాల పై నేరము మోపే ప్రయత్నాలు ఖకి ల సైడ్ నుంచి జరుగుతున్నాయి అన్న ఆరోపణ నేపథ్యంలో అసలు దొంగను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.

గతంలో వ్యాపారుల మధ్య స్నేహపూర్వక పోటీ తప్ప దొంగతనాల వరకు బరితెగించే దాఖలు లేని తరుణంలో భద్రాచలంలో మొట్టమొదటిసారిగా తోటి వ్యాపారే దొంగ అవతారం ఎత్తడంతో సదరు దొంగ వైట్ కలర్ తో సవాసం చేసిన ప్రముఖులు తలదించుకునే పరిస్థితి ఏర్పడడంతో ఆత్మ పరిశీలనలో పడ్డట్టుగా పట్టణంలో గుసగుసలు వినపడుతున్నాయి

Updated On 15 Nov 2024 9:14 PM IST
cknews1122

cknews1122

Next Story