రేపే తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు అభ్యర్థులు పాటించవలసిన సూచనలు హైదరాబాద్ : గ్రూప్‌-3 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు సిద్ధం చేసింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందు బాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.ప్రభుత్వం జారీ చేసిన …

రేపే తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు

అభ్యర్థులు పాటించవలసిన సూచనలు

హైదరాబాద్ : గ్రూప్‌-3 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు సిద్ధం చేసింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందు బాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.

హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీని ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సి ఉంటుంది.

హాల్ టికెట్ పై క్లియర్ గా కనిపించేలా ఫొటో ఉండాలి. ఇలా లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి.

పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

ఉదయం 08. 30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 09.30 గంటలకు గేట్లు మూసివేస్తారు.

ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లరాదు.మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. టీజీపీఎస్సీ పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటారు.

రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో పేపర్ -1 ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 05:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది.

ఇక నవంబర్ 18వ తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది.

గ్రూప్ 3 హాల్ టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
గ్రూప్ 3 అభ్యర్థులు TGPSC వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
హోమ్ పేజీలో కనిపించే Download Hall Ticket For Group-III Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో TGPSC ID , పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేయాలి.

డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1,388 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు

Updated On 16 Nov 2024 1:23 PM IST
cknews1122

cknews1122

Next Story