Telangana

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత!

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత!

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత!

హైదరాబాద్:నవంబర్ 16
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కొద్ది రేపటి క్రితం కన్నుమూ శారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

పరిస్థితులు విషమిం చడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందించారు. అయినా పరిస్థితులు మరింత విషమించడంతో ఆయన కన్నుమూశారు.

చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం అందిన వెంటనే మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీ సమావేశాల నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. రామ్మూర్తి నాయుడు అన్న, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

అయితే తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

మంత్రి నారా లోకేష్‌ ఇప్పటికే ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి రామకృష్ణ, నందమూరి కుటుంభ సభ్యులు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు ఆసుపత్రికి చేరుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button