కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా: నవంబర్ 19
తెలంగాణలో పదేళ్లు అధికా రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ గడ్డపై కాళోజీ కళాక్షేత్రాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి ఇవాళ ప్రారంభిం చడం జరిగిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేయకపోగా, అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్న వారి కాళ్లలో కట్టెలు పెడుతోందన్నారు. కెసిఆర్ చేసిన అప్పులకు వేలకోట్లలో వడ్డీ కష్టమని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తి ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కిరాయి మనుషులతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదని, ఊచలు లెక్కపెట్ట వలసిం దేనని,సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని భూములు అమ్ముకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆరేనని అన్నారు. కేసీఆర్ తెలంగాణను మద్యంలో, మత్తులో ముంచి ప్రజలకు వివేకం లేకుండా చేయాలనుకు న్నారు. మద్యం ఏరులై పారించి తెలంగాణలో ఆడపడుచులకు అన్యా యం చేయాలనుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మహిళలు అభివృద్ధి చెందడం కెసిఆర్ కు ఇష్టం లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచుల అభివృద్ధికి బాటలు వేసి వారిని పురు షాధిక్య ప్రపంచం నుండి స్వేచ్ఛను కల్పిస్తున్నామని చెప్పారు.
వరంగల్ అభివృద్ధికి ప్రణాళికు రచించి, పర్యవేక్షించాల్సిన బాధ్యతలు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించామన్నారు. ఆ బాధ్యతలను ఆయన నెత్తినేసుకుని పూర్తి చేసేపనిలో ఉన్నారని మంత్రి పొంగులేటిని అభినందించారు.