రిజిస్ట్రేషన్‌ లేకపోతే ప్రైవేట్‌ ఆస్పత్రుల సీజ్‌ ప్రైవేట్‌ ఆస్పత్రులను రిజిస్ట్రేషన్‌ లేకుండా నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి ఆస్పత్రులను సీజ్‌ చేస్తామని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి స్పష్టం చేశారు. ఖమ్మంలోని వెంకటేశ్వర నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఫార్మసీ, ల్యాబ్‌ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. స్థానికులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే, యాంటీ బయోటెక్స్‌ ఎక్కువగా వాడొద్దని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఇబ్బంది పడకుండా చికిత్స …

రిజిస్ట్రేషన్‌ లేకపోతే ప్రైవేట్‌ ఆస్పత్రుల సీజ్‌

ప్రైవేట్‌ ఆస్పత్రులను రిజిస్ట్రేషన్‌ లేకుండా నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి ఆస్పత్రులను సీజ్‌ చేస్తామని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి స్పష్టం చేశారు.

ఖమ్మంలోని వెంకటేశ్వర నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఫార్మసీ, ల్యాబ్‌ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. స్థానికులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే, యాంటీ బయోటెక్స్‌ ఎక్కువగా వాడొద్దని ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఇబ్బంది పడకుండా చికిత్స చేయాలని సూచించారు. ఆస్పత్రులపై నిఘా ఉన్నందున నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని చెప్పారు.

ఆతర్వాత కేఎంసీ సమావేశ మందిరంలో ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లకు సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు, 'యూ విన్‌' యాప్‌పై ఇచ్చిన శిక్షణలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల ఇమ్యూనైజేషన్‌ అధికారులు చందూనాయక్‌, లక్ష్మీనారాయణ, ప్రోగ్రాం అధికారులు రామారావు, వెంకటరమణతో పాటు డాక్టర్‌ జ్యోత్స్న, డేవిడ్‌ తదితరులు హాజరయ్యారు.

Updated On 20 Nov 2024 10:03 AM IST
cknews1122

cknews1122

Next Story