నిజమైన రైతులను బేషరతుగా విడుదల చేయాలి…
వాళ్ల మీద పెట్టిన కేసును కొట్టేసి వాళ్ళ విడుదల చేయాలి..
లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ధర్మసోత్ దశరధ్ నాయక్.
తల్లాడ, నవంబర్,20 తల్లాడ మండల కేంద్రంలో తల్లాడ మండల అధ్యక్షుడు. భూక్య రవి నాయక్ ఆధ్వర్యంలో. లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ధర్మసొత్.దశరధ్ నాయక్ ను తల్లాడ పోలీస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా
దశరథ్ నాయక్. విలేకరులతో మాట్లాడుతూ. లగచర్ల గ్రామంలో కలెక్టర్ గారిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం అన్నారు. నిజమైన లంబాడి రైతులు ఎవరెవరు ఉన్నారో వారిని బేషరుదుగా విడుదల చేయాలని. దాడికి కారుకులైన వారికి శిక్షించాలని వారు కోరారు.
మేము మా లంబాడి రైతుల పక్షాన పరామర్శించడానికి. వెళుతున్నప్పుడు ప్రభుత్వం మాకు సహకరించాలని. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లట్లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన ఏనుముల రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని లగచర్ల గ్రామ లంబాడి రైతులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.