
యూరియా కోసం తిప్పలు… బారులు తీరిన రైతులు.
నాలుగు గ్రామాలకు కలిపి 110 యూరియా బస్తాలు మాత్రమే.
ఎన్ని ఎకరాలు ఉన్న ఒక్క యూరియా బస్తా.
రేపటి కోసం కూడా ఈరోజె టోకెన్లు.
పోలీస్ బందోబస్తుతో యూరియా పంపిణీ.
సీకే న్యూస్ ప్రతినిధి కొలిశెట్టి వేణు,తిరుమలాయపాలెం.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. 20 రోజులుగా యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం కాకరవాయి, బీరోలు,సుబ్లేడు,బచ్చోడు, పైనం పల్లి,తిరుమలాయపాలెం, తాళ్లచెర్వు, మహమ్మదాపురం, హైదర్ సాయి పేట, ఎర్రగడ్డ, తేట్టెలపాడు, జల్లేపల్లి, పిండిప్రోలు, పాతర్లపాడు గ్రామపంచాయతీల వద్ద తెల్లవారుజాము నుండి రైతులు వందలాదిగా క్యూ లైన్ లో నిలుచున్నారు. బుధవారం సుమారు 110 బస్తాలు మాత్రమే యూరియా వస్తుండడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. తెల్లవారుజామున 5 గంటల నుండి రైతులు క్యూ లైన్ లో నిల్చుని యూరియా కోసం బారులు తీరారు. ఉదయం 9 గంటలైనా కొన్ని గ్రామాలలో వస్తాయన్న 110 బస్తాలు రాకపోవడంతో టోకెన్లు తీసుకొని గ్రామపంచాయతీ ఎదుట పడిగాపులు కాస్తున్నారు.. ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తామనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.. మరుసటి రోజు కూడా ఈరోజునే టోకెన్లు ఇస్తుండటంతో గ్రామపంచాయతీ ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. యూరియా బస్తాలు తక్కువ ఉండటంతో రైతులు వరుసలో నిలబడటానికి పోటీపడ్డారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి వరుసలో ఉంచారు.