ప్రభుత్వంలో తన స్థానం ఏంటో చెప్పిన మంత్రి పొంగులేటి
ప్రభుత్వంలో నా స్థానం 11: పొంగులేటి
TG: ప్రభుత్వంలో తాను 11వ స్థానంలో ఉన్నానని మంత్రి పొంగులేటి అన్నారు. సీఎం రేవంత్ తర్వాతి స్థానంలో ఎవరు ఉన్నారని ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు.
రెండో స్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారని చెప్పారు.
అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పొంగులేటి అన్నారు.