ఎటపాక వైపు కరకట్ట మంజూరు చేయాలి. కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. సుభాష్ నగర్ కరకట్ట నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. గ్రామసభలో సిపిఎం డిమాండ్. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), నవంబర్ 30, సుభాష్ నగర్ వెనుక గోదావరి కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందివ్వాలని …

ఎటపాక వైపు కరకట్ట మంజూరు చేయాలి.

కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి.

సుభాష్ నగర్ కరకట్ట నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.

గ్రామసభలో సిపిఎం డిమాండ్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

నవంబర్ 30,

సుభాష్ నగర్ వెనుక గోదావరి కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందివ్వాలని గ్రామ సభలో సిపిఎం డిమాండ్ చేసింది. భద్రాచలం ఆర్డీవో అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల అంశం ఎజెండాగా పెట్టిన గ్రామసభలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడారు. .కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అరా, కొర నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం మానుకోవాలని, 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి ముంపు నుండి భద్రాచలం రక్షణకు కరకట్ట పొడిగించాలని సిపిఎం అనేక పోరాటాలు చేసిందని ఫలితంగా వచ్చిన ఈ కరకట్టను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని అన్నారు. ప్రస్తుతం నిర్మించే ఈ కరకట్ట 700 మీటర్లు పొడవు మాత్రమే ఉందని దీనికి కేవలం 38 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. దీనితో పాటు రామాలయం నుండి సుభాష్ నగర్ కాలనీ వరకు, బుజ్జి సెంటర్ నుండి ఎటపాక చివరి వరకు కరకట్ట ను అభివృద్ధి చేయాలని దాని ఎత్తు పెంచి, పొడిగించాలని దానికి కావలసిన నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గ్రామసభలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామితో పాటు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు, పట్టణ కమిటీ సభ్యులు నకిరికంటి నాగరాజు, భూపేంద్ర శాఖ కార్యదర్శి రాధా తదితరులు పాల్గొన్నారు..

Updated On 30 Nov 2024 11:32 PM IST
cknews1122

cknews1122

Next Story