విద్యార్థినితో కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ అసభ్య చాటింగ్..
కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థినితో అసభ్యంగా మెసేజ్ లు చేశాడంటూ ఆందోళనకు దిగారు విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు. ఈ ఘటన మియాపూర్ మాధినగూడ లోని శ్రీ చైతన్య కాలేజ్ లో జరిగింది.కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ శివ..
అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో ఫోన్ లో అసభ్యంగా మెసేజ్ లు చేశాడు. వైట్ డ్రెస్ లో బాగున్నావు..ఏం చేస్తున్నావ్..మాట్లాడడం లేదేంటి.. అంటూ ఇలా విద్యార్థినికి పదే పదే మెసేజ్ లు చేసిన స్క్రీన్ షాట్ లు పోలీసులకు చూపించారు తల్లిదండ్రులు.
దీనిపై కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లితండ్రులు. అయితే కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ విద్యార్థి సంఘం నాయకులు కాలేజ్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.
విద్యార్థినితో ఫోన్ లో అసభ్యంగా ప్రవర్తించిన వైస్ ప్రిన్సిపాల్ శివను సస్పెండ్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.