వరంగల్ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య? వరంగల్ జిల్లా : బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలోని రంగంపేటలో ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది… వివరాల్లోకి వెళితే.. కాకతీయ గ్రామీణ బ్యాంక్‌ లో విధులు నిర్వర్తిస్తున్న రాజమోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఏకంగా అతడి కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి దుండగులు అతి కిరాతకంగా కత్తులు, ఇనుప రాడ్లతో హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై ఉన్న కారులో వదిలి అక్కడి నుంచి …

వరంగల్ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య?

వరంగల్ జిల్లా : బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలోని రంగంపేటలో ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది…

వివరాల్లోకి వెళితే.. కాకతీయ గ్రామీణ బ్యాంక్‌ లో విధులు నిర్వర్తిస్తున్న రాజమోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఏకంగా అతడి కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి దుండగులు అతి కిరాతకంగా కత్తులు, ఇనుప రాడ్లతో హతమార్చారు.

అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై ఉన్న కారులో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారు జామున అటుగా వెళుతున్న స్థానికులకు కారులో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే, నిందితులు పారిపోతున్న దృశ్యాలు అక్కడునున్న సీసీ కెమెరా లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.

ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

Updated On 3 Dec 2024 2:43 PM IST
cknews1122

cknews1122

Next Story