సంగారెడ్డి జిల్లాలో జోరుగా కల్తీకల్లు? సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. కల్తీ కల్లు తాగిన వారు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటూ ఉండగా.. కల్లు తయారీదారులు మాత్రం కోట్లకు పడగలెత్తు తున్నారు. డైజీ ఫామ్, ఆల్ఫోజోలాం వంటి మత్తు పదార్దాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ కల్లుపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతు న్నారు. దీంతో కల్లు తయా …

సంగారెడ్డి జిల్లాలో జోరుగా కల్తీకల్లు?

సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. కల్తీ కల్లు తాగిన వారు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటూ ఉండగా.. కల్లు తయారీదారులు మాత్రం కోట్లకు పడగలెత్తు తున్నారు.

డైజీ ఫామ్, ఆల్ఫోజోలాం వంటి మత్తు పదార్దాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

కల్తీ కల్లుపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతు న్నారు. దీంతో కల్లు తయా రీదారులు రెచ్చిపోయి మరీ కల్తీ కల్లును తయారు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు యధేచ్చగా తయారవు తోంది. రోజూ కొన్ని వేల లీటర్ల కల్తీ కల్లు తయారై జనం మధ్యకు వెళ్తోంది. మత్తు పదార్ధాలను కలిపి కల్లు తయారు చేస్తున్నారు.

జిల్లాలో 40 వరకు కల్లు డిపోలు ఉన్నాయి. ఈ 40 డిపోల నుంచి నిత్యం వేలాది సీసాల కల్తీ కల్లు జనం మధ్యకు వెళ్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప మిగతా టైమ్ లో అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

సంగారెడ్డి జిల్లాలో పెద్దగా తాటి, ఈత చెట్లు లేవు. కానీ, ఇంత కల్లు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది మాత్రం కొంచెం సందేహించాల్సిందే. పెద్ద పెద్ద డబ్బాల్లో కల్తీ కల్లును తయారు చేసి జనంలోకి వదులుతున్నారు. ఈ కల్తీ కల్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

కొన్ని సందర్భాల్లో ప్రాణాలే పోతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించాలి. అసలు ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి, ఎన్ని తాటి చెట్లు ఉన్నాయి.. ఎంత దిగుబడి వస్తుంది? ఈ కల్లు అంతా ఎక్కడ తయారవుతుంది? అనే కోణంలో విచారించాలని స్థానికులు కోరుతున్నారు.

40 డిపోలలో కల్తీ కల్లు తయారు చేస్తున్నా ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఈ కల్తీ కల్లు తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు. మతిస్థిమితం లేక ఆసుపత్రుల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి,

ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగి కల్తీ కల్లు తయారీని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.

Updated On 3 Dec 2024 11:23 AM IST
cknews1122

cknews1122

Next Story