మళ్లీ భూకంపం వచ్చే అవకాశం…
గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూప్రకంపనలు సాధారణమని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ట్సిట్యూట్ (NGRI) శాస్తవేత్త డా.శేఖర్ తెలిపారు. ‘మళ్లీ భూకంపం వచ్చే అవకాశం ఉంది.
అయితే మా అంచనా ప్రకారం భూప్రకంపనల తీవ్రత 6కు మించకపోవచ్చు. ప్రజలకు భయాందోళనలు అవసరం లేదు.
భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రత నమోదు అయింది’ అని పేర్కొన్నారు.
కాగా ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర పలు జిల్లాలలో భూకంపం నమూనాలతో భూమి బుధవారం ఉదయం 7:01 నుంచి కొద్ది సెకండ్ల పాటు భూమి దద్దరిల్లింది, ఎన్నోసార్లు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంకేతాలు పలుమార్లు అక్కడక్కడ సంభవించినప్పటికీ బొగ్గు గనుల ప్రభావం వల్లే ఇలా అయి ఉండవచ్చని అధికారులు.
ప్రజలను మభ్యపెడుతూ ఇలాంటి సంకేతాలకు ప్రజలు భయపడాల్సిన పనిలేదు అని ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని. పత్రికా ముఖంగా పలు మార్లు వెల్లడించడం జరిగింది. కానీ ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలను చూస్తుంటే’ ప్రకృతి హెచ్చరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అనే భవనతో ప్రజలు ఆయా ప్రాంతాలలో భయభ్రాంతికి గురవుతున్నారు.
దీనికి నిలువెత్తు నిదర్శనమే’ ఎన్నడూ లేని విధంగా ఇటీవల మేడారం దండకారణ్యంలో జరిగినటువంటి ప్రకృతి విధ్వంసమే నిలువెత్తు నిదర్శనం.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా జరిగిందా లేక ఈ సంఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుందా అనే విషయం తెలియాల్సి ఉంది..