ట్రాక్టర్ టైర్ కింద పడి చిన్నారి మృతి. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), డిసెంబర్ 04, భద్రాద్రి జిల్లా, ఆళ్లపల్లి ముక్కుపచ్చలారని చిన్నారి ట్రాక్టర్ మధ్య టైర్ కింద పడి మృతి చెందిన ఘటన ఆళ్లపల్లి మండలం అనంతోగులో చోటుచేసుకుంది. అనంతోగు గ్రామానికి చెందిన గలిగే నరేష్ కృష్ణవేణి దంపతుల కుమార్తె కిరణ్య బుధవారం నాడు నానమ్మ మొక్కజొన్న కూలికి వెళుతుండగా ఆమెతోపాటు చిన్నారి కిరణ్య కూడా ట్రాక్టర్ …
ట్రాక్టర్ టైర్ కింద పడి చిన్నారి మృతి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
డిసెంబర్ 04,
భద్రాద్రి జిల్లా, ఆళ్లపల్లి ముక్కుపచ్చలారని చిన్నారి ట్రాక్టర్ మధ్య టైర్ కింద పడి మృతి చెందిన ఘటన ఆళ్లపల్లి మండలం అనంతోగులో చోటుచేసుకుంది. అనంతోగు గ్రామానికి చెందిన గలిగే నరేష్ కృష్ణవేణి దంపతుల కుమార్తె కిరణ్య బుధవారం నాడు నానమ్మ మొక్కజొన్న కూలికి వెళుతుండగా ఆమెతోపాటు చిన్నారి కిరణ్య కూడా ట్రాక్టర్ పై కలిసి వెళ్ళింది.
ఈ నేపథ్యంలో ట్రాక్టర్ పై కూర్చున్న చిన్నారి కిరణ్య ప్రమాదవశాత్తు జారి ట్రాక్టర్ పై నుండి కింద పడిపోయింది. దీనితో చిన్నారి తలపై నుంచి ట్రాక్టర్ మధ్య టైరు ఎక్కిపోవడం తో అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి పట్ల నిర్లక్ష్యం వహించడమే ఈ ప్రమాదానికి దారితీసింది అని పలువురు అనంతోగు ప్రజలు వాపోతున్నారు. ఈ దుర్ఘటన తో అనంతోగులో విషాదఛాయలు అలుముకున్నాయి.