బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌ రావు అరెస్ట్.. గచ్చిబౌలి పీఎస్‌కు తరలింపు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని గచ్చిబౌలికి తరలించారు. హరీష్‌ రావును ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్‌రావుపై కేసు నమోదైంది. పాడి కౌశిక్‌ …

బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌ రావు అరెస్ట్..

గచ్చిబౌలి పీఎస్‌కు తరలింపు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు.

బలవంతంగా అదుపులోకి తీసుకుని గచ్చిబౌలికి తరలించారు. హరీష్‌ రావును ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్‌రావుపై కేసు నమోదైంది. పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది.

పోలీసులు వాహనంలోకి ఎక్కే ముందు హరీష్‌ రావు తీవ్రంగా ప్రతిఘటించారు. బంజారాహిల్స్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు చేరుకుంటున్నారు

భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌ పీఎస్‌లో విధుకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకుని అరెస్ట్‌ చేశారు. ఆయన్ను అక్కడి నుంచి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు.

Updated On 5 Dec 2024 12:28 PM IST
cknews1122

cknews1122

Next Story