ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే అరెస్టులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు కాంగ్రెస్ పార్టీ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఒంటెద్దు నరసింహ రెడ్డి పచ్చటి పల్లెల్లో రాజకీయ రంగు పూలుముకుంటూ హత్యలా..? పాచ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి టిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి వంటెద్దు నరసింహారెడ్డి సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య డిసెంబర్ 06 మఠంపల్లి మండలం భీమ్లా తండా కు చెందినా పాచ్య హత్యను నిరసిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ …

ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే అరెస్టులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు

కాంగ్రెస్ పార్టీ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఒంటెద్దు నరసింహ రెడ్డి

పచ్చటి పల్లెల్లో రాజకీయ రంగు పూలుముకుంటూ హత్యలా..?

పాచ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి

టిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి వంటెద్దు నరసింహారెడ్డి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య డిసెంబర్ 06

మఠంపల్లి మండలం భీమ్లా తండా కు చెందినా పాచ్య హత్యను నిరసిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ హత్యగానే భావించాలని హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రంలోని స్థానిక బిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ మన్యం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్చార్జి నరసింహారెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల ప్రజలు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు నిర్వహిస్తున్నారు. అవేవీ వీళ్ళకి కనిపించడం లేదని ప్రశ్నిస్తే కేసులు అడిగితే అరెస్టులు ఇది కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాలా అని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను నమ్ముకోలేదు పోలీసులనే నమ్ముకున్నాడని అందుకే స్వేచ్ఛగా ప్రజల మధ్యలో తిరగలేకపోతున్నారు
గతంలొ సీఎం కేసీఆర్ పదేళ్లపాటు పరిపాలించినప్పుడు ఎక్కడా కూడా హత్యా రాజకీయాలు చేయలేదన్
పరిపాలన చేతకాక, అమాయక కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, అది చాలాదన్నట్టుగా హత్యలకు గురి చేస్తున్నారని
కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలనకు ప్రజలందరూ త్వరలోనే పాడె కడతారని
హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అడ్డు అదుపు లేకుండా అక్రమంగా ఇసుక,, మట్టి తరలింపు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని
నియోజకవర్గ వ్యాప్తంగా ఓ రెడ్ బుక్ ప్రారంభించడం జరుగుతుంది అని ప్రకటించారు.
ఎవరెవరు ఏమేమి వేధింపులకు గురి చేస్తున్నారో అందులో అన్ని లిఖితపూర్వకంగా రాయడం జరుగుతుందని హెచ్చరించారు.
పోలీసులు తమ డ్యూటీ తాము చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డ్యూటీ మీరు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Updated On 6 Dec 2024 4:17 PM IST
cknews1122

cknews1122

Next Story