రూ.300కే ఇంటర్నెట్ సేవలు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రజలందరికీ అధునాతన డిజిటల్ కనెక్టివిటీ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు తక్కువ ధరలో ఇంటర్నెట్, వర్చువల్ నెట్‌వర్క్, టెలిఫోన్, మరియు పలు OTT సేవలు లభించనున్నాయి.పథకం తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలకు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేయనున్నారు. పథకం ప్రారంభోత్సవాన్ని సీఎం …

రూ.300కే ఇంటర్నెట్ సేవలు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రజలందరికీ అధునాతన డిజిటల్ కనెక్టివిటీ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది.

దీని ద్వారా గ్రామీణ ప్రజలకు తక్కువ ధరలో ఇంటర్నెట్, వర్చువల్ నెట్‌వర్క్, టెలిఫోన్, మరియు పలు OTT సేవలు లభించనున్నాయి.పథకం తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలకు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేయనున్నారు.

పథకం ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల డిజిటల్ అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రజల జీవితాల్లో సాంకేతిక మార్పులు తీసుకురానున్నారు.

ఇంటర్నెట్ కనెక్షన్ 20 ఎంబీపీఎస్ వేగంతో లభ్యం కానుండటంతో, విద్య, వ్యాపార రంగాలు, ఆరోగ్య రంగం వంటి పలు శాఖల్లో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.

ముఖ్యంగా, ఈ కనెక్షన్ సౌకర్యం గ్రామీణ యువతకు ఆన్‌లైన్ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల ప్రజల నిత్యజీవనంలో మార్పు రానుండగా, ఇది గ్రామీణ ప్రాంతాల డిజిటల్ పరివర్తనలో కీలకమైన అడుగుగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ ఆభివృద్ధికి కీలక ప్రాజెక్టుల అమలు చేస్తోంది. తాజాగా ఈ పథకంతో ఆ ప్రావేయర్టీ మరింతగా విస్తరించనున్నట్లు కనిపిస్తోంది.

ఈ పథకాన్ని త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విస్తరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది తెలంగాణ డిజిటల్ విప్లవానికి దోహదపడుతుందని, ప్రజలు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలు పొందగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కవర్‌జ్ మరింత బలోపేతం కానుంది.

Updated On 7 Dec 2024 11:43 AM IST
cknews1122

cknews1122

Next Story