కోటి రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించిన సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్
తల్లాడ, డిసెంబర్ 6 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో శుక్రవారం సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయి దయానంద్ పర్యటించారు
ఈ పర్యటనలో భాగంగా తల్లాడ మండల లబ్ధిదారులకు కోటి రూపాయల కల్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యే దిశగా కృషి చేస్తుందని అన్నారు.
బుగ్గపాడు బహిరంగ సభకు తల్లాడ మండలం నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు