సంక్రాంతి నాటికి మద్దులపల్లి మార్కెట్ నిర్మాణం పూర్తి
- మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాధబాబు
- పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ దయాకర్ రెడ్డి తో కలిసి పనుల పరిశీలన
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం రూరల్ : సంక్రాంతి నాటికి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణం పూర్తవుతుందని ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథబాబు పేర్కొన్నారు.
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డితో కలిసి శనివారం మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంత్రి పొంగులేటి ఆదేశాలతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అత్యాధునిక హంగులతో నాణ్యత ప్రమాణాలతో మార్కెట్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
మార్కెట్ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులపై పూర్తి దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి, అంబటి సుబ్బారావు తదితరులు ఉన్నారు.