సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం
నిర్మాత దిల్ రాజుకు పదవి!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు రేవంత్ రెడ్డి సర్దార్ కీలక పదవి అప్పగించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన దిల్ రాజుకు.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తెలంగాణ సిఎస్ శాంతి కుమారి… తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజు ను నియమిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని దిల్ రాజు పై అనేక ప్రచారాలు జరిగాయి. కానీ, పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల సహాయంతో.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దిల్ రాజు కు దక్కింది.