2 లక్షల పార్టీ బీమా చెక్కు అందజేత పేరం కొండలు, కుటుంబాన్ని పరామర్శించిన ఒంటెద్దు నరసింహారెడ్డి సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 06 మఠంపల్లి మండలం కామంచికుంట తండా పరిధిలోని బక్కలచ్చి తండా కు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బానోతు మోహన్ ఇటీవల లారీ ప్రమాదంలో మరణించగా మోహన్ వారి భార్యకు పార్టీ తరపున 2 లక్షల రూపాయల బీమా చెక్కును హుజూర్నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం …

2 లక్షల పార్టీ బీమా చెక్కు అందజేత

పేరం కొండలు, కుటుంబాన్ని పరామర్శించిన

ఒంటెద్దు నరసింహారెడ్డి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 06

మఠంపల్లి మండలం కామంచికుంట తండా పరిధిలోని బక్కలచ్చి తండా కు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బానోతు మోహన్ ఇటీవల లారీ ప్రమాదంలో మరణించగా మోహన్ వారి భార్యకు పార్టీ తరపున 2 లక్షల రూపాయల బీమా చెక్కును హుజూర్నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం వారి ఇంటికి వెళ్లి మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ఆధ్వర్యంలో చెక్కును అందించడం జరిగింది. అనంతరం చౌటపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు పేరం కొండలు వారి తండ్రిగారైన వెంకయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా పేరం కొండలు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు

ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి జగన్ నాయక్ , మండల నాయకులు కోట నాయక్ పలువురు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated On 7 Dec 2024 9:02 AM IST
cknews1122

cknews1122

Next Story