అంబులెన్స్​తో దొంగ హల్​చల్ .. ఏఎస్ఐని ఢీకొట్టి మరీ పరార్ 108 అంబులెన్స్​తో ఓ దొంగ హల్​చల్ చేశాడు. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రి ఎదుట నిలిపి ఉంచిన అంబులెన్స్ ను సినీ ఫక్కీలో చోరీ చేసేందుకు యత్నించాడు.వెహికల్​తో ఖమ్మం వైపు వెళ్తుండగా.. పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ చేజింగ్​లో ఓ ఏఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం హైదరాబాద్ ​సమీపంలోని హయత్​నగర్​లో ఓ ఆస్పత్రి ఎదుట నిలిపి ఉంచిన 108 అంబులెన్స్ ను దుండగుడు తీసుకెళ్లాడు. హైదరాబాద్-విజయవాడ హైవేపై …

అంబులెన్స్​తో దొంగ హల్​చల్ ..

ఏఎస్ఐని ఢీకొట్టి మరీ పరార్

108 అంబులెన్స్​తో ఓ దొంగ హల్​చల్ చేశాడు. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రి ఎదుట నిలిపి ఉంచిన అంబులెన్స్ ను సినీ ఫక్కీలో చోరీ చేసేందుకు యత్నించాడు.వెహికల్​తో ఖమ్మం వైపు వెళ్తుండగా.. పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.

ఈ చేజింగ్​లో ఓ ఏఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం హైదరాబాద్ ​సమీపంలోని హయత్​నగర్​లో ఓ ఆస్పత్రి ఎదుట నిలిపి ఉంచిన 108 అంబులెన్స్ ను దుండగుడు తీసుకెళ్లాడు.

హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్తుండగా.. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దీంతో అంబులెన్స్‌ సైరన్‌ మోగిస్తూ అతివేగంతో విజయవాడ వైపు పరారయ్యాడు.

ఈ క్రమంలో చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపేందుకు ఏఎస్సై జాన్ రెడ్డి ప్రయత్నించగా ఢీకొట్టి వెళ్లిపోయాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి.. కొన ఊపిరిలో కొట్టుమిట్టాడుతున్నారు.

అనంతరం కేతేపల్లి మండలం కోర్ల పహాడ్‌ టోల్‌ గేట్‌ వద్ద గేటును ఢీకొట్టి వేగంగా దూసుకెళ్లాడు. ఈ ఘటనలతో సూర్యాపేట పోలీసులు అలర్ట్ అయ్యారు.చివరికి సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుపై లారీలు అడ్డంగా పెట్టించి దొంగను పట్టుకున్నారు.

నిందితుడిపై గతంలోనూ పలు చోరీ కేసులు ఉన్నట్టు గుర్తించారు. కాగా, ఏఎస్సై జాన్‌రెడ్డి తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు.

Updated On 8 Dec 2024 11:46 AM IST
cknews1122

cknews1122

Next Story