చికెన్,చపాతీ తిని విద్యార్థులకు అస్వస్థత…
ఇద్దరకి వాంతులు, దగ్గు..
విద్యార్థుల తల్లిదండ్రులు చికెన్, చపాతి తీసుకురావడం వలనే …
నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ కస్తూర్బా కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆదివారం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు చికెన్, చపాతి తీసుకువచ్చి తినిపించారు.
కొద్దిసేపటికే ఆ ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత కావడంతో..నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లి తెలిపిన వివరాల ప్రకారం..గడ్డమీది అక్షయ, ప్రేమలత ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అక్షయ వాళ్ళ అమ్మ ఆదివారం కావడంతో చికెన్, చపాతీ చేసుకొని వచ్చింది.
అక్షయ ఫ్రెండ్ అయినా ప్రేమలత ఇద్దరు కలిసి తిన్నారు. సాయంత్రం 5:30 కాగానే ఇద్దరకి వాంతులు, దగ్గు వచ్చాయి. తోటి విద్యార్థులు వెంటనే హాస్టల్ ఎస్ ఓ శోభ రాణి చెప్పారు.
ఆమె వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడ ఉన్న అటెండర్, మరో ఇద్దరు విద్యార్థులను తోడు చేసి కలిసి జిల్లా ఆసుపత్రికి ఆటోలో పంపించింది.
ప్రస్తుతం ఆ విద్యార్థులు ఇద్దరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఐ గోవర్ధన్ జిల్లా ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై హాస్టల్ ఎస్ఓ శోభారాణి మాట్లాడుతూ..ఇవాళ ఆదివారం కావడంతో పేరెంట్స్ విద్యార్థులకు చికెన్, చపాతి తినిపించి వెళ్లిపోయారన్నారు.
సాయంత్రం ఆ ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత కావడంతో..వెంటనే పేరెంట్స్ కి సమాచారం ఇచ్చి విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
మరో విద్యార్థి పూజిత కుడా వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన ఫాస్ట్ ఫుడ్ తిని అస్వస్థతకు గురైందన్నారు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని తెలిపారు.