సీఎం కప్ గేమ్స్ ప్రారంభించిన
ఎంపీడీవో బాణాల శ్రీనివాస్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 07
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కలిగిస్తాయని ఎంపీడీవో బాణాల శ్రీనివాస్ అన్నారు. బిల్లా నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో సీఎం కప్ గేమ్స్ ను ఎంపీడీవో బాణాల శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని, సీఎం కప్ లో స్టేట్ స్థాయి వరకు వెళ్లి మఠంపల్లి మండలానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ హెచ్ఎం రాము పంచాయతీ కార్యదర్శి వై ప్రవీణ్ కుమార్ పిడి ఎం నరేష్ గ్రామ పెద్దలు బానోతు రాముడు , భోజ్జా ఇతర ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు