సీనియర్ కళాకారుడు దొంతగాని సత్యనారాయణ ను సన్మానించిన
పాన్ ఇండియా సాంస్కృతిక సంస్థ
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 07
విజయవాడ హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్ నందు పాన్ ఇండియా సాంస్కృతి సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రపంచ సామాజికవేత్తల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కళాకారులను, సమాజసేవ కార్యకర్తలను,డాక్టర్లను, కార్మికులను ఘనంగా సత్కరించడం జరిగింది.
హుజూర్నగర్ రంగస్థల సంక్షేమ సంఘం అధ్యక్షులు సీనియర్ కళాకారులు దొంతగాని సత్యనారాయణ ను పాన్ ఇండియా సాంస్కృతి సంస్థ వారు అద్దంకి రాజావారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికతో పాటు సన్మాన పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో ముందుగా రంగస్థలం దొంతగాని కళాబృందం ప్రదర్శించిన అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి ప్రదర్శనను తిలకించిన ఆహుతులందరూ కళాకారులను ప్రశంసించారు.
నృత్య ప్రదర్శనలు ప్రదర్శించిన కళాకారులు సిహెచ్ నాగయ్య, దొంతగాని మణిదీప్, దాసరి సుకన్య, బీరవోలు అఖిల, డాన్స్ మాస్టర్ వీరబాబులను శాలువాతో సత్కరించారు.