ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు 40 వేలు లంచం తీసుకుంటు పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ తెలంగాణలో ఏసీబీ కొరడా ఝులిపిస్తోంది. లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల భరతం పడుతోంది. లేటెస్ట్ గా ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో లంచం అడిగినందుకు ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఓ పెన్షనర్ నుంచి 40 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్ …

ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు

40 వేలు లంచం తీసుకుంటు పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్

తెలంగాణలో ఏసీబీ కొరడా ఝులిపిస్తోంది. లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల భరతం పడుతోంది. లేటెస్ట్ గా ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో లంచం అడిగినందుకు ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది.

ఓ పెన్షనర్ నుంచి 40 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ట్రెజరీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పి. నగేష్ తిరుమలయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి దగ్గర తనకు రావాల్సిన 4 లక్షల రూపాయల పెన్షన్ కు గాను 10 శాతం కమిషన్ 40 వేలు అడిగాడు.

బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతె ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ రైడ్ లో నగదు లేకున్నప్పటికీ లంచము అడిగినా తీసుకున్నా నేరమేనని అదే సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

Updated On 9 Dec 2024 6:08 PM IST
cknews1122

cknews1122

Next Story