మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డీఈఈ దివ్యజ్యోతి ఇంట్లో దొరికిన డబ్బు పై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.గత రెండు సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తున్నారు. మంగళవారం మణికొండ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న అధికారులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో తనిఖీలు చేపడుతున్నారు. దివ్య జ్యోతి చేసిన ప్రతి సంతకాల పేపర్ ఫైల్ ను పరిశీలించడానికి ఏసీబీఅధికారులు …

మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..

రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

డీఈఈ దివ్యజ్యోతి ఇంట్లో దొరికిన డబ్బు పై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.గత రెండు సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తున్నారు.

మంగళవారం మణికొండ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న అధికారులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో తనిఖీలు చేపడుతున్నారు.

దివ్య జ్యోతి చేసిన ప్రతి సంతకాల పేపర్ ఫైల్ ను పరిశీలించడానికి ఏసీబీఅధికారులు తీసుకెళ్లారు. అలాగే మణికొండ మున్సిపల్ కమిషనర్ ను, ఏఈ అధికారిని విచారించినట్లు తెలుస్తుంది.

అలాగే కొంతమంది అధికారుల ఫోన్లు కూడా పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి.

Updated On 11 Dec 2024 12:47 PM IST
cknews1122

cknews1122

Next Story