Andhra PradeshPolitical

కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MRO

కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MRO

కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MRO

మహిళా VRO ఇంట్లో బడితె పూజ..

తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉంటున్న ఓ మహిళా వీఆర్‌ఓను ఓ ఎమ్మార్‌ఓ కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ, ‘మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా? కోడికూర వండిపెడతావా?’ అంటూ అతడు మెసేజ్‌లు పెట్టాడు. ఈ వేధింపులు ఆమెకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించాయి.
బుధవారం రాత్రి, ఈ ఎమ్మార్‌ఓ బరితెగించి మహిళా వీఆర్‌ఓ ఇంటికి వెళ్లాడు.

షర్ట్ విప్పి, తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ఘటన గురించి తెలుసుకున్న వీఆర్‌ఓ తల్లి సమయస్ఫూర్తితో స్పందించి, ఆ ఎమ్మార్‌ఓను చితకబాదింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటన మహిళలపై అధికార దుర్వినియోగాన్ని మరోసారి బట్టబయలు చేసింది, మరియు దోషికి కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button