గురుకులాల్లో మెస్ చార్జీల పెంపు గొప్ప నిర్ణయం
-మధిర తహసీల్దార్ రాంబాబు
సికె న్యూస్ ప్రతినిధి మధిర
స్థానిక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వసతి గృహాల్లో మెస్ చార్జీలు పెంచి, ఏకీకృత కామన్ మెనూ తీసుకురావడానికి పురస్కరించుకొని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సహ పంక్తి భోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మధిర తహసీల్దార్ రాంబాబు పాల్గొని నూతన మెనూ విధానాన్ని ఆవిష్కరించడం జరిగింది.
కళాశాల ప్రధానాచార్యులు రాములు అధ్యక్షతన జరిగిన సభలో మధిర తహసీల్దార్ రాంబాబు మాట్లాడుతూ గురుకులాల్లో, వసతి గృహాల్లో మెస్ చార్జీలు పెంచడం మరియు ఏకీకృత కామన్ మెనూను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం పిల్లలు మరియు తల్లిదండ్రులు సంతోషించదగ్గ విషయంగా కొనియాడారు. అంతేగాక ఇదే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా క్రోడీకరించిన వసతిగృహాల నియమావళిని కూడా ఆవిష్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. తదనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మార్పు జరిగిన మెనూ గురించి మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.
అదే పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్ట్ గ్యాలరీని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు రమణ, ఉమా రావు అధ్యాపకులు , సత్యం, అయినాల సైదులు, బుచ్చయ్య, అంజయ్య, నాగేశ్వర రావు, రేణుక తదితరులు పాల్గొన్నారు.