వాజేడు ఎస్సై ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
ఆత్మహత్యకు ప్రేరేపించిన మహిళ
అరెస్టు చేసిన వెంకటాపురం సిఐ
సీకే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలంలో సంచలం సృష్టించిన వాజేడు ఎస్సై ఆత్మహత్యకు కారణమైన మహిళను వెంకటాపురం సిఐ అరెస్ట్ చేశారు.
దీనికి సంబంధించిన వివరాలను వెంకటాపురం సిఐ మీడియాకు ఈ విధంగా వివరాలు తెలియజేశారు…
తేదీ 02/12/2024 నాడు వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ పిస్తోల్తో కాల్చుకొనిన సంఘటన విషయమై అతని మరణానికి కారణమైన మహిళను ఈరోజు వెంకటాపురం సిఐ అరెస్ట్ చేశారని ఈమె పేరు బానోతు అనసూర్య అలియాస్ అనూష, తండ్రి పేరు బానోతు అస్కర్ అలియాస్ లస్కర్, వయసు 29 సంవత్సరాలు,కులం ఎస్టి లంబాడి, వృత్తి అడ్మిన్ స్టాప్ ( వి బి ఐ టీ కాలేజ్), చిలకలూరి మండలం, సూర్యాపేట జిల్లా.
ఈమె గత ఏడు నెలల క్రితం రాంగ్ నెంబర్ కాలింగ్ ద్వారా ఎస్ఐ హరీష్ తో పరిచయం ఆ తర్వాత సన్నిహిత్యం పెంచుకోవడం జరిగింది హరీష్ సబ్ ఇన్స్పెక్టర్ అవడం వల్ల అతనిని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుంటుందని భావించి, ఆమె ఎస్సై హరీష్ ను ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని తను పెళ్లి చేసుకోకపోతే మీడియా వారికి మరియు పై అధికారులకు నన్ను శారీరకంగా వాడుకున్నాడని చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఒత్తిడి తేవడంతో హరీష్ ఎస్ఐ ఆమె వల్ల తీవ్రమైన మనోవేదనకు లోనై మండపాక శివారులో ఫెరిడో రెస్టారెంట్లో ఆమె మాటల ద్వారా ఆత్మహత్యకు ప్రేరేపితుడై తన సర్వీస్ రివాల్వలతో గవద కింద కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలాంటి మహిళ యొక్క ప్రమేయం ఈ కేసులో ఉండడం వల్ల సంబంధిత పూర్తి ఆధారాలతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పై మహిళ ఎస్సై హరీష్ ను పెళ్లి చేసుకోమని లేదా చచ్చిపోమని బెదిరించడం తో తను తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగిందని ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలతో ఈ మహిళను అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరచడం జరిగింది అని వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వివరాలు వెల్లడించారు.