చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు….
“జి” ప్లస్ త్రీ లిఫ్టు సౌకర్యంతో అక్రమ నిర్మాణం….
ప్రజా ప్రభుత్వంలో ఆదాయానికి గండి….
జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం పై స్పందించేది ఎవరు ?
పంచాయతీలపై పర్యవేక్షణ వేసే అధికారే లేరా ?
పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్న పట్టించుకోరా
లేక ఎవరు ఏమి చెప్పినా మా పని మేమే చేస్తామని తీరా
జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తి కావస్తున్న పంచాయతీ అధికారులకు తెలవదా
పంచాయతీలో ఏం జరుగుతుందో తెలుసుకునేది ఎవరు?
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
డిసెంబర్ 18,
విద్యానగర్ గ్రామ పంచాయతీలో కేరాఫ్ అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతూ జి ప్లస్ నిర్మాణంతోపాటు లిఫ్టు సౌకర్యంతో అక్రమ నిర్మాణం కడుతున్న అధికారులకు కనిపించడం లేదా అని పలువురు విమర్శిస్తున్నారు.
పంచాయతీల పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనా అనే సందేహం వ్యక్తం కాక తప్పదు. పర్యవేక్షణ ఉంటే జి ప్లస్ త్రీ తో పాటు లిఫ్ట్ సౌకర్యంతో కడుతున్న ఎవరి కళ్ళకు కనిపించలేదా కనిపించిన ఎవరు ఏమి చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారు దీని వెనుక ఎవరున్నారు. ఏ నాయకులకు భయపడి పంచాయతీ మండలాధికారులు పంచాయతీలలో పర్యవేక్షించ లేక పోతున్నారు.
పంచాయతీలకు ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్న నాయకులు ఎవరు. వారి ఒత్తిడి తోటే ఇటువంటి అక్రమ నిర్మాణాలను చూచి చూడనట్లు అధికారులు వదిలేస్తున్నారా . పంచాయతీ ఆదాయాల కు గండి కొడుతున్న నాయకులని మండల పంచాయతీ అధికారులను జిల్లా అధికారులు ఒకసారి వీరిపై దృష్టి పెడితే బాగుంటుంది.
ఎదేచ్ఛగా సాగుతున్న అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు 1/70 ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి బహుళ అంతస్తుల నిర్మాణంతోపాటు లిఫ్టు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు కానీ మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో పలువురు ప్రజా ప్రభుత్వం పై విమర్శలకు దిగుతున్నారు . చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ పరిధిలో గల రాంనగర్ ఏరియాలో ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతు బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నారు.
1/70 యాక్ట్ చట్టం ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టరాదని నిబంధనలు ఉన్నప్పటికీ, అవేమీ పట్టనట్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆయన స్పందించి అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్న ప్రజలు.