ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.శృతికి చిన్నతనం నుంచి గాయని కావాలని బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మారి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు …
![ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ](https://cknewstv.in/wp-content/uploads/2024/12/n64395256417345912396540626de934392c5821cf51446dc3b168f53aa4686e6029e0cfa589c6f76c9ba41.jpg)
ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వారు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.శృతికి చిన్నతనం నుంచి గాయని కావాలని బలమైన కోరిక ఉండేది.
ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మారి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.
20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి అప్పటి నుంచి కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో కట్నం తీసుకురావాలని అత్తమామలు శృతి వేధించారని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడుగా మారాడని ఆరోపిస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచే ఈ వేధింపులకు గురి కావడంతో తట్టుకోలేని శృతి.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. తన కూతురును భర్త, అత్తమామలే చంపారని శృతి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఉన్న శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)