తాళం వేసి ఉన్న ఇంటిలో పట్టపగలు చోరీ… వేములపల్లి మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంటిలో పట్టపగలు చోరీ బంగారం డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో శనివారం పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు ప్రవేశించి బంగారం,కొంత డబ్బు ఎత్తుకెళ్లడం జరిగింది. వివరాల్లోకెళితే వేములపల్లి మండలకేంద్రంలోనిపుట్టల జ్యోతి అనే మహిళా వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తూ ఉన్నది రోజు మాదిరిగానే శనివారం రోజు కూడా తన పనుల నిమిత్తం …

తాళం వేసి ఉన్న ఇంటిలో పట్టపగలు చోరీ…

వేములపల్లి మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంటిలో పట్టపగలు చోరీ బంగారం డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో శనివారం పట్టపగలే తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు ప్రవేశించి బంగారం,కొంత డబ్బు ఎత్తుకెళ్లడం జరిగింది.

వివరాల్లోకెళితే వేములపల్లి మండలకేంద్రంలోని
పుట్టల జ్యోతి అనే మహిళా వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తూ ఉన్నది రోజు మాదిరిగానే శనివారం రోజు కూడా తన పనుల నిమిత్తం వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి వచ్చి తన ఇంట్లోని బీరువాను తెరిచి చూడగా అందులోని రెండు తులాల బంగారం,35 వేల నగదు కనిపించకపోవడంతో బయటికి వెళ్లిన తన కుమారుడైన మనోజ్ ను పిలిచి అడగగా తనకు కూడా ఏమీ తెలవదు

అనడంతో బంగారం నగదు దొంగిలించబడ్డవి అని నిర్ధారించుకున్న వారు లబోదిబోమంటూ హుటాహుటిన స్థానిక వేములపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయాన్ని వారికి వివరించగా ఘటన స్థలానికి చేరుకున్న వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని బాధితుల నుండి వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Updated On 22 Dec 2024 9:49 AM IST
cknews1122

cknews1122

Next Story